స్పూర్తి రెడ్డి అక్రమ ఆస్తుల గుర్తింపు
సహకరించని జల మండలి మేనేజర్
రంగారెడ్డి జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తిమింగలాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అవినీతికి అలవాటు పడిన వాళ్లు యధేశ్చగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది విస్తు పోయేలా చేసింది. ప్రతి నెలా నెలా భారీ ఎత్తున వేతనాలు అందుకుంటున్న ఆయన లంచం తీసుకోవడం విచిత్రం.
మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని మణికొండ జల మండలిలో మేనేజర్ గా పని చేస్తున్న స్పూర్తి రెడ్డిని ఏసీబీ వల పని పట్టుకుంది. తమ పనుల కోసం వచ్చే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఉన్నట్టుండి కొత్త నల్లా కనెక్షన్ కోసం స్పూర్తి రెడ్డి రూ. 30 వేలు డిమాండ్ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. డబ్బులను తీసుకుంటున్న సమయంలో పట్టుకుంది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పుప్పాలగూడలో స్పూర్తి రెడ్డి ఉంటోంది. ఆమె ఉంటున్న నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో పలు అక్రమంగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఏసీబీ ఆఫీసర్లకు చుక్కలు చూపించింది. రెండు గంటల పాటు తను ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పకుండా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.