NEWSTELANGANA

వామ్మో వీడు మామూలోడు కాదు

Share it with your family & friends

ఏసీబీ దాడుల్లో నోట్ల క‌ట్ట‌లు..ఆభ‌ర‌ణాలు

నిజ‌మాబాద్ జిల్లా – ఓ వైపు నిరుద్యోగులు జాబ్స్ లేక నానా తంటాలు ప‌డుతుంటే మ‌రో వైపు ఉద్యోగులు మాత్రం అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం పోటీ ప‌డుతున్నాడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల‌కు పైగా కూడ‌బెట్టాడు. ఏసీబీ దాడుల‌లో విస్తు పోయేలా నిజాలు బ‌య‌ట ప‌డ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో సూప‌రింటెండెంట్ గా ప‌ని చేస్తున్నాడు డి. న‌రేంద‌ర‌ర్. ఆదాయానికి మించి ఆస్తుల‌ను కూడ‌బెట్టాడు. ఏసీబీ సోదాల‌లో రూ. 6,07,00,000 కోట్ల విలువైన అక్ర‌మ ఆస్తులు బ‌య‌ట ప‌డ్డాయి.

ఈ దాడుల‌లో రూ. 2,93,00,000 కోట్ల న‌గ‌దు , రూ. 1,10,00,000 బ్యాంక్ లో బ్యాలెన్స్ , 51 తులాల బంగారం బ‌య‌ట ప‌డింది. అంతే కాదు రూ. 1,98,00,000 విలువ చేసే స్థిరాస్థులు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా డి. న‌రేంద‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

దాసరి నరేందర్ తోపాటు అతని బంధువుల ఇళ్ల లోనూ ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయలు నగదు బయటపడింది. ఈ నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. మొత్తం అత‌డి నుంచి 17 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.