ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబై – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఈ దాడి కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ముంబై సౌత్ జోన్ 9 డీసీపీ దీక్షిత్ బెగెడ్ ఆధ్వర్యంలో 10 బృందాలను ఏర్పాటు చేశారు.
తాజాగా దాడి కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న దుర్గ్ లో ఆకాష్ కనోజియాను రైల్వే పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇవాళ మరో నిందితుడు మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్ ను అదుపులోకి తీసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్ నివాసానికి 35 కిమీ దూరంలోని హీరానందానీ ఎస్టేట్‌లో ఉన్న అతడిని పట్టుకున్నారు. కాగా వెయిటర్ గా పని చేస్తున్న విజయ్ దాస్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
ఈ మొత్తం దాడి ఘటనకు సంబంధించి మరాఠా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తమ చేతకానితనం వల్లనే దాడులు జరుగుతున్నాయనే అపవాదు తప్పంటూ పేర్కొంది. సైఫ్ పై దాడి వెనుక ముంబై అండర్ వరల్డ్ మాఫియా హస్తం లేదని స్పస్టం చేశారు మంత్రి యోగేశ్.