చని పోయిందని చెప్పినా పట్టించుకోలేదు
అల్లు అర్జున్ పై ఏసీపీ రమేష్ కుమార్ కామెంట్స్
హైదరాబాద్ – నటుడు అల్లు అర్జున్ పై రోజు రోజుకు కేసు ఉచ్చు బిగుస్తోంది. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. ఆదివారం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు డీజీపీ జితేందర్.
ఇదే సమయంలో తొక్కిసలాటలో ఒక మహిళ చని పోయిందని చెప్పినా అల్లు అర్జున్ పట్టించు కోలేదని సంచలన ఆరోపణలు చేశారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్. సినిమా ముగిశాకే బయటికొస్తా అన్నాడని మండిపడ్డారు. ఈ ఘటన గురించి అల్లు అర్జున్ కు తెలియ చేస్తామంటే వాళ్ల మేనేజర్ పట్టించు కోలేదన్నాడు. ఇంకో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా సినిమా చూశాకే వస్తానని అన్నారని ఆరోపించారు.
అప్పుడు తాము మా డీసీపీ, సిబ్బందితో కలిసి లోపలికి వెళ్లి అల్లు అర్జున్ ను బయటకి తీసుకొచ్చామని చెప్పారు. రమేష్ డీజీపీతో కలిసి ఇవాళ మీడియాతో మాట్లాడారు. తమ తప్పేమీ లేదంటూ అల్లు అర్జున్ చెప్పడం ..ఆ తర్వాత పోలీసులు హీరోను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.