అల్లు అర్జున్ కు ఏసీపీ వార్నింగ్
పోలీసులపై కామెంట్స్ చేస్తే ఊరుకోం
హైదరాబాద్ – ఏసీపీ విష్ణు మూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటుడు అల్లు అర్జున్ కు. ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తోలు తీస్తామన్నారు. చెప్పేది ఒకటి చేసేది మరోకటి అంటూ మండిపడ్డారు. పోలీసు శాఖపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. తను చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ తొక్కిసలాట ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏసీపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
బిడ్డా ఇంకోసారి గనుక పోలీసుల గురించి చులకన చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నావో నీకేమైనా తెలుసా అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు ఏసీపీ విష్ణు మూర్తి.
ప్రతి మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయని, వాటిని దాటితే చూస్తూ ఊరుకోమన్నారు. అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. సంధ్య థియేటర్ కేసులో ఓ రిమాండ్ ఖైదీ అని అన్నారు. కేసు విచారణ ఉండగా అల్లు అర్జున్ ఎలా మీడియాతోత మాట్లాడతారని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తను ప్రవర్తించ లేదని ఆరోపించారు ఏసీపీ విష్ణు మూర్తి.