వైసీపీకి నటుడు అలీ రాజీనామా
సంచలన నిర్ణయం తీసుకున్న యాక్టర్
హైదరాబాద్ – ప్రముఖ టాలీవుడ్ నటుడు, యాంకర్ అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో జగన్ రెడ్డి పార్టీ ఓటమి కొని తెచ్చకుంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలకే పరిమితం కాగా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీయే సర్కార్ ను ఏర్పాటు చేసింది. ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. జగన్ రెడ్డికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రముఖ నటులు పోసాని కృష్ణ మురళితో పాటు అలీకి కూడా రాష్ట్ర స్థాయి పోస్టును కట్టబెట్టారు. ఇక హాస్య నటుడు అలీకి జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియంఇంచారు.
తాజాగా తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విస్తు పోయేలా చేసింది. ఆనాడు జగన్ రెడ్డి పిలిచి పదవి కట్టబెట్టారు. అంతే కాకుండా అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రామిస్ చేశారు. తీరా పవర్ పోయింది. సీటు రాలేదు.