ENTERTAINMENT

అల్లు అర్జున్ ఎందుకిలా..?

Share it with your family & friends

నిన్న అలా నేడు ఇలా

హైద‌రాబాద్ – సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌నకు సంబంధించి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు న‌టుడు అల్లు అర్జున్. ఇప్ప‌టికే కేసు న‌మోదైంది. ప్ర‌చారంపై ఉన్నంత శ్ర‌ద్ద త‌న కార‌ణంగా చ‌ని పోయిన రేవ‌తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే, శాస‌న స‌భ ప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ. దీనికి కీల‌క‌మైన స‌మాధానం ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగించాయి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో. 5 ఏళ్ళు కాదు… గంట పరిపాలించినా ఇలా పాలించాలి… లేదంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ కొంద‌రు పేర్కొనడం విశేషం.

పగలు, ప్రతీకారాలు, బుద్ధి చెప్పడాలు వంటి సోది డైలాగులు ఉండకూడ‌దు. చాలా మంది రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా చాలా తక్కువ అంచనా వేసి ఉంటారు. అరెస్ట్ చేస్తే ఎవడో సినిమా యాక్టర్‌కు సపోర్ట్ చేసిన సినిమా వాళ్ళు… తల్లి ప్రాణం పోతే…చిన్నారి చావు బతుకుల్లో ఉంటే ఎవడూ హాస్పిటల్‌కు వెళ్ళక పోవ‌డం విడ్డూరంగా ఉంది.

రేవంత్ అడిగిన దానికి ఆన్సర్ ఉందా…? కన్ను పోయిందా…? కాలు విరిగాయా…? కిడ్నీలు పోయినయా…?
ఎందుకు అంత మంది వెళ్ళి పరామర్శించారు…? హాస్పిటల్‌కు ఎందుకు వెళ్ళలేదు…? థియేటర్‌కు వెళ్ళినప్పుడు చేతులు ఊపుకుంటూ రోడ్ షో ఎందుకు చేసాడు…?

ప్రాణం పోయిందని ఏసీపీ చెప్తే ఎందుకు సినిమా చూసేవాడు బయటకు రాలేదు…? ఈ రోజు వరకూ ఆస్పత్రికి ఎందుకు వెళ్ళలేదు…? కుటుంబానికి సాయం ఇంకా ఎందుకు చేయలేదు…? సింపతీ క్రియెట్ అయితే… అరగంట స్పీచ్‌తో మొత్తం కడిగేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాడు…

అర్ధం కాని వాడికి హిందీలో కూడా చెప్పాడు… నేషనల్‌ మీడియాకు కూడా అర్ధమయ్యే భాషలో చెప్పాడు…దీంతో శవాల మీద సంపాదించుకునేది సినీ పరిశ్రమ అనే క్లారిటి వచ్చింది చాలా మందికి…బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచే డ్రామాలు… బ్లాక్ టికెట్ దందా… అన్నీ తొక్కేసాడు ఒకే దెబ్బ‌కు రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *