ముగిసిన అల్లు అర్జున్ విచారణ
ఇంటికి చేరుకున్న ఐకాన్ స్టార్
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కేసు విచారణ ముగిసింది. భారీ బందోబస్తు మధ్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఏసీపీ, డీసీపీ ఆధ్వర్యంలో మూడున్నర గంటలకు పైగా విచారణ చేపట్టారు. 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
విచారణ పూర్తయిన వెంటనే గట్టి బందోబస్తు మధ్య ఇంటికి చేరుకున్నారు బన్నీ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కాన్వాయ్ తో ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. దీంతో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది.
అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు. కాగా మరోసారి అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన బన్నీ తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని పోలీసులకు హామీ ఇచ్చారు. ఆయన విచారణ ముగిసిన అనంతం బయటకు వెళ్లి పోయారు. మీడియాతో మాట్లాడేందుకు ఒప్పు కోలేదు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, కేసు కోర్టులో ఉన్న సమయంలో మాట్లాడటం సరి కాదన్నారు బన్నీ.