రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ
మర్యాద పూర్వకంగానేనన్న నటుడు
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య కొద్దిసేపు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలుసుకున్న అనంతరం నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం మర్యాద పూర్వకంగానే తనను కలుసుకున్నానని, తామిద్దరి మధ్య గతం నుంచి సత్ సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు నటుడు .
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ నేతలతో ఎక్కువగా టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు లేక పోలేదు. పలు కీలక పోస్టులలో కూడా ఆంధ్రాకు చెందిన వారినే నియమించారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన మేధావులు, రాజకీయ విశ్లేషకులు సైతం సీఎం అనుసరిస్తున్న తీరు పట్ల, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.