సీఎం కామెంట్స్ అబద్దం
నటుడు జగపతి బాబు వెల్లడి
హైదరాబాద్ – ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రేవతి కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించ లేదన్నది పూర్తిగా అబద్దమన్నారు. షూటింగ్ నుంచి రాగానే ఆస్ప్రతిలో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించానని చెప్పారు.
రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు జగపతిబాబు. తనకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదన్నారు. అందుకే తాను పరామర్శించినట్లు ఎవరికీ తెలియనీయ లేదన్నారు . సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ పరామర్శించ లేదని నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పడంతో తాను ఇలా మీ ముందుకు రావాల్సి వచ్చిందన్నారు జగపతి బాబు.
ఇదిలా ఉండగా ఇవాళ డీజీపీ జితేందర్ తో పాటు సిటీ పోలీస్ కమిషనర్ ఏవీ ఆనంద్, ఏసీపీ విష్ణు మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై ఎలాంటి కోపం లేదన్నారు. కానీ పోలీసులను ఉద్దేశించి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
మరో వైపు అల్లు అర్జున్ ఇంటిపై ఓయు జేఏసీ నేతలు దాడికి పాల్పడ్డారు.