మనసు నొప్పిస్తే మన్నించండి – కార్తీ
శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై ప్రకటన
తమిళనాడు – తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు కార్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ప్రసాదంపై తాను కామెంట్స్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నటుడు కార్తీ.
ఇదిలా ఉండగా ఒక బాధ్యత కలిగిన నటుడిగా ఉన్న కార్తీ ఇలా కోట్లాది భక్తుల మనో భావాలను పట్టించుకోకుండా లడ్డూపై జోకులు వేస్తే ఎలా అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదెల.
దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే గౌరవమని, అంతకు మించి తిరుమల పుణ్య క్షేత్రం పట్ల భక్తి ఉందని, శ్రీవారి లడ్డూ విషయంపై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని పేర్కొన్నారు నటుడు కార్తీ.
తనను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఒకవేళ శ్రీవారి భక్తుల మనో భావాలు దెబ్బ తిన్నాయని భావించినట్లయితే తనను మన్నించాలని కోరారు నటుడు కార్తీ. మొత్తంగా పవన్ కళ్యాణ్ అసలు సిసలైన రాజకీయ నాయకుడినని నిరూపించారు.