న్యాయ పరంగా కోర్టుకు వెళతానన్న నటి
అనంతపురం జిల్లా – జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు నటి మాధవీలత. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగానని, రాగి సంగటి, నాటు కోడి తిని పెరిగానని అన్నారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని, ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు కూడా భార్య ఉందనే విషయం మరిచి పోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
తనకు మహిళలంటే గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నటి మాధవీలత. తను రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా రంగంలో పని చేస్తున్న వారంతా తప్పులు చేస్తున్నట్లు మాట్లాడటం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
తనను ఇటు రాజకీయ పరంగా అటు సినిమా పరంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడారని అందుకే తాను అలా కామెంట్ చేయాల్సి వచ్చిందన్నారు. తాను బతుకు దెరువు కోసం సినిమా పరిశ్రమలోకి రాలేదని స్పష్టం చేశారు నటి మాధవీలత.