జర్నలిస్టు రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ
మీడియా సమాజానికి తప్పైందని క్షమాపణ
హైదరాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది నటుడు మోహన్ బాబు వ్యవహారం. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది రాచకొండ పోలీస్ కమిషనర్. ఇప్పటికే మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ , మంచు విష్ణులకు నోటీసులు ఇచ్చింది.
వారు సీపీ వద్దకు వెళ్లారు. విచారణకు హాజరయ్యారు. రూ. లక్ష పూచీకత్తుతో బాండు రాయించుకుని వార్నింగ్ ఇచ్చారు . పిస్టల్స్ కలిగి ఉన్న మోహన్ బాబు, విష్ణుకు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సుధీర్ బాబు.
తమ ముందు విచారణకు రావాలంటూ ఆదేశించింది సీపీ. ఈ సందర్బంగా దిద్దుబాటు చర్యలకు దిగారు మోహన్ బాబు. జల్ పల్లి ఘటనలో తన దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించారు తండ్రీ కొడుకులు మంచు మోహన్ బాబు, విష్ణు.
తన కారణంగానే తప్పిదం జరిగిందన్నారు . రంజిత్ తల్లి, భార్య, పిల్లలను క్షమించాలని కోరారు. ఉద్దేశ పూర్వకంగా తాను కొట్టలేదన్నారు. అయితే తనకు క్షమాపణలు వద్దని, మీడియా సమాజానికి చెప్పాలన్నారు.