ENTERTAINMENT

మోహ‌న్ బాబు జంప్..పోలీసుల గాలింపు

Share it with your family & friends

అరెస్ట్ చేస్తార‌ని బెంగ‌ళూరుకు జంప్

హైద‌రాబాద్ – హైకోర్టు బిగ్ షాక్ ఇవ్వ‌డంతో న‌టుడు మోహ‌న్ బాబు గాయ‌బ్ అయ్యారు. జ‌ర్న‌లిస్ట్ పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో హ‌త్యా య‌త్నం కింద కేసు నమోదైంది. ఈ ఘ‌ట‌న‌లో ముంద‌స్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అరెస్ట్ చేయ‌కుండా మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. కౌంట‌ర్ దాఖ‌లు త‌ర్వాతే విచార‌ణ చేస్తామ‌ని పేర్కొంది. దీంతో అరెస్ట్ చేస్తార‌ని అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా మంచు మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు గాను బెంగ‌ళూరుకు వెళ్లిన‌ట్లు, అక్క‌డ త‌ల దాచుకున్న‌ట్లు స‌మాచారం. విష‌యం తెలుసుకున్న హైద‌రాబాద్ పోలీసులు హుటా హుటిన బృందంగా ఏర్ప‌డి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అంతకు ముందు మోహ‌న్ బాబుతో పాటు కొడుకులు మంచు మ‌నోజ్, మంచు విష్ణు ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదు చేసుకున్నారు. రాచ‌కొండ సీపీ తుపాకుల‌ను సీజ్ చేయాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో మ‌నోజ్, విష్ణుల‌తో రూ. ఒక ల‌క్ష పూచీక‌త్తు రాయించుకున్నారు.

ఎలాంటి ఘ‌ట‌న జ‌రిగినా మీ ఇద్ద‌రే బాధ్యులంటూ హెచ్చ‌రించారు. అయినా మార‌లేదు మోహ‌న్ బాబు కుటుంబ స‌భ్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *