బన్నీ ఘటనపై ప్రస్తావనకు రాలేదు
నటుడు ..బిల్డర్ మురళీ మోహన్
హైదరాబాద్ – సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన సీఎం ముందు రాలేదని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు , బిల్డర్ మురళీ మోహన్. సినీ పెద్దలతో కలిసి ఆయన కూడా చర్చల్లో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. బెనిఫిట్ షోలు, అవార్డుల గురించి ప్రత్యేకంగా చర్చకు వచ్చిందన్నారు .
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ బాసటగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా ఇంటర్నేషనల్ స్టూడియోను ఏర్పాటు చేయాలని సీఎంకు సూచించారు నటుడు అక్కినేని నాగార్జున, దర్శకుడు కె . రాఘవేంద్ర రావు.
వీటన్నింటికి ఆమోదం తెలిపారని వెల్లడించారు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు.