అలరించే సినిమాలను ఆదరించండి
పిలుపునిచ్చిన నాగబాబు కొణిదల
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు నాగబాబు కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ , రష్మిక మందన్నా, శ్రీలీల కలిసి నటించిన పుష్ప-2 ది రూల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనిని ఏకంగా 12,000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఓ రికార్డ్. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో కొంత గ్యాప్ వచ్చిందంటూ చోటు చేసుకున్న ప్రచారం నేపథ్యంలో సీరియస్ గా స్పందించారు నాగబాబు.
ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమా అనేది వేలాది మంది కష్టంతో కూడుకున్న పని అన్నారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో ..వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా అని స్పష్టం చేశారు నాగబాబు.
ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామని పేర్కొన్నారు. అందరిని అలరించే సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నానంటూ తెలిపారు.