ఖండించిన వైఎస్సార్సీపీ
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో ఉన్న తనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకు వెళ్లారు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు.
గత నాలుగు నెలల నుంచి మీడియా ముందుకు రాలేదు. దీంతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తను కీలక పాత్ర పోషించారు. ఎన్నికల కంటే ముందు ఆ తర్వాత సీరియస్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో తనకు కీలక పదవి అప్పగించారు జగన్ మోహన్ రెడ్డి.
ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టారు. తను జబర్దస్త్ తదితర స్కిట్స్ లో కనిపించారు. ఈ మధ్య సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. పదే పదే ప్రెస్ మీట్ లు పెట్టి తీవ్ర ఆరోపణలు చేయడం, అనుచిత కామెంట్స్ చేస్తూ వచ్చారు పోసాని కృష్ణ మురళి.