పిలుపునిచ్చిన ప్రభాస్
హైదరాబాద్ – నూతన సంవత్సరం సందర్బంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక ప్రకటన చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ప్రభాస్ మద్దతుగా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ వీడియో సందేశం ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఇటు ఏపీలో అటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టు పడుతున్నాయి. ప్రధానంగా యువతీ యువకులు వీటి బారిన ఎక్కువ పడుతున్నారు. తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
కాగా ఇరు ప్రభుత్వాలు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. మద్యం షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఇరు రాష్ట్రాలకు భారీ ఎత్తున మద్యం ద్వారానే అత్యధికంగా ఆదాయం లభిస్తోంది. ఓ వైపు వద్దంటూ ప్రచారం చేస్తూనే ఇంకో వైపు అమ్మకాలు సాగించడం పట్ల జనం మండిపడుతున్నారు.