ENTERTAINMENT

కొత్త భ‌క్తుడికి నామాలు ఎక్కువ‌

Share it with your family & friends

మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ కామెంట్స్

హైద‌రాబాద్ – విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌రోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. సీరియ‌స్ పోస్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ప‌వ‌న్ ను ఉద్దేశించి ఇక చాలు అంటూ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా కొత్త భ‌క్తుడికి పంగ‌నామాలు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఇక మీరు చేసింది , న‌టించింది చాల‌ని, ప్ర‌జ‌ల కోసం చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఎన్నో స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని, మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ది సేవ చేసేందుకు..రాజ‌కీయం చేసేందుకు కాద‌ని హిత‌వు ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపై కూడా తీవ్రంగా స్పందించారు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. దేశంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, తిరిగి లడ్డూ పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చేలా చేయొద్ద‌ని కోరారు.

దీనిపై సీరియ‌స్ అయ్యారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్ర‌కాశ్ రాజ్ జ‌ర నోరు జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ట్వీట్స్ వార్ కొన‌సాగుతూనే ఉంది. తాజా ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది.