పవన్ కళ్యాణ్ తో నటుడు పార్తీపన్ భేటీ
కీలక అంశాలపై చర్చలు
అమరావతి – ప్రముఖ తమిళ సినీ రంగానికి చెందిన నటుడు ఆర్. పార్తీపన్ ఆదివారం మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా తనకు సంబంధించిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కొణిదెలకు బహూకరించారు పార్తీపన్. ఇటీవల సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు డిప్యూటీ సీఎం. ఈ తరుణంలో తీవ్రమైన ఆరోపణలు , విమర్శలు వచ్చాయి. అయినా వాటిని కాదనలేదు. కొందరు నటులు సారీ కూడా చెప్పారు. దీనిపై తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు పవన్ కళ్యాణ్ ను తప్పు పట్టారు.
ఈ తరుణంలో కీలకమైన నటుడిగా ఉన్న ఆర్ . పార్తీపన్ పవర్ స్టార్ ను కలుసు కోవడం మరింత ఆసక్తిని, ఉత్కంఠను రేపుతోంది. మరో వైపు తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్, సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన తళపతి విజయ్ నూతన పార్టీ పెట్టారు. ఇవాళ లక్షలాది మందితో కీలక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారని చెప్పక తప్పదు.