తలైవా ఆరోగ్యం పదిలం
కేవలం పరీక్షల కోసమే
తమిళనాడు – ప్రముఖ నటుడు , సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎప్పటి లాగే పరీక్షలు చేయించేందుకు ఆస్పత్రికి వచ్చారని తెలిపాయి. కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే ముందు జాగ్రత్తంగా టెస్టులు చేయించుకున్నారని పేర్కొన్నారు.
ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెంద వద్దని కోరారు. ఇదిలా ఉండగా తలైవా రజనీకాంత్ ఆరోగ్యం బాగో లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వేలాది మంది అభిమానులు తలైవర్ చికిత్స కోసం సందర్శించిన ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
దీంతో పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అయితే రజనీకాంత్ ఆరోగ్యం పదిలంగానే ఉందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు ఆస్పత్రి వైద్యులు. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఇవాళ సాయంత్రం లోగా రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు.
దీంతో అభిమానులు కొంత శాంతించారు. అయితే రజనీకాంత్ భార్య మాత్రం అందరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆయనకు ఏమీ కాదని పేర్కొన్నారు. దేవుడు ఆయనను చల్లంగా చూస్తాడని స్పష్టం చేశారు.