రజనీకాంత్ కు గోల్డెన్ వీసా
యూఏఈలో అందుకున్న తలైవా
తమిళనాడు – ప్రముఖ నటుడు తలైవా రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను యూఏఈ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసా దక్కింది. దీనిని ప్రముఖులకు ఆ దేశం గోల్డెన్ వీసాలను ఇస్తూ వస్తోంది.
తాజాగా సూపర్ స్టార్ ను ఎంపిక చేసింది ఈ పురస్కారానికి. ఇందులో భాగంగా యూఏఈకి ఎప్పుడైనా వెళ్లేందుకు వీలు కలుగుతుంది. తనకు గోల్డెన్ వీసాను అందజేసినందుకు సంతోషంగా ఉందన్నారు రజనీకాంత్.
ఇదిలా ఉండగా తలైవాకు గోల్డెన్ వీసా ఇవ్వడం పట్ల సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, ఇతరులు సంతోషం వ్యక్తం చేశారు. తనకు గోల్డెన్ వీసాను ఇచ్చినందుకు , ప్రభుత్వానికి , లులూ గ్రూప్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీకి ధన్యవాదాలు తెలిపారు రజనీకాంత్.
కాగా అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డిసిటి) ఛైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ , అబుదాబి ప్రభుత్వం యూసఫ్‌తో పాటు రజనీకాంత్‌ను గోల్డెన్ వీసాతో సత్కరించింది.