అమీన్ పీర్ దర్గా సన్నిధిలో రామ్ చరణ్
త్వరలోనే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్
కడప జిల్లా – కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా పేరు పొందింది కడప పట్టణలోని అమీన్ పీర్ దర్గా. ఈ దర్గాకు దేశంలోని ప్రముఖులు సందర్శించడం, మొక్కులు తీర్చు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ (ఏఆర్ రెహమాన్ ) ఇక్కడికి వస్తారు. తాజాగా ప్రముఖ నటుడు రామ్ చరణ్ మంగళవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు.
ప్రస్తుతం ఆయన అయ్యప్ప దీక్ష మాలో ఉన్నారు. ఆయనకు కూతురు కూడా పుట్టింది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటించారు. ఇది త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్గాను దర్శించుకుని ప్రార్థన చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ రాకతో కడపకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు.
దీంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా రామ్ చరణ్ ను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.