లీలావతి ఆస్పత్రికి తరలింపు
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలకని స్విట్జర్లాండ్ కు వెళ్లి వచ్చారు సైఫ్ తన కుటుంబంతో కలిసి. తిరిగి ముంబైకి వచ్చారు.
తన నివాసంలో భార్య కరీనా కపూర్ , పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ కు, దుండగుడికి మధ్య తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు. వెన్నెముక పక్కన కూడా గాయం కావడం, తీవ్ర రక్తస్త్రావం కావడంతో హుటా హుటిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు.
బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ పై ఎందుకు దాడి జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని, విచారణ చేపట్టామన్నారు . ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ కలిసి నటించిన దేవర -1 చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించారు సైఫ్ అలీ ఖాన్.
ఇదిలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన తెలిసిన వెంటనే బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.