రేవ్ పార్టీలో నేను లేను
ప్రకటించిన హీరో శ్రీకాంత్
హైదరాబాద్ – బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది టాలీవుడ్ ను. ప్రత్యేకించి సినిమా రంగానికి చెందిన వారు ఇందులో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రముఖ నటి హేమ తాను కూడా ఉన్నానని చెప్పడాన్ని ఖండించింది. అయితే పోలీసులు మాత్రం ఆమె చెప్పిందంతా అబద్దమని, రేవ్ పార్టీలో పాల్గొన్నదని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
బెంగళూరు ఫామ్ హౌస్ లో నుంచే ఆమె షూట్ చేసిందని పేర్కొన్నారు. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు హేమ. ఇదిలా ఉండగా మరో నటుడు వెలుగులోకి వచ్చాడు. శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీకాంత్. తాను రేవ్ పార్టీలు, పబ్ లకు వెళ్లే వాడిని కాననని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలని గిట్టని వారు చేస్తున్న ప్రచారమని కొట్టి పారేశారు. తాను నిశ్చింతగా ఇంట్లోనే ఉన్నానని చెప్పారు.
తన లాగే ఒకరు ఉండడంతో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో ఉన్నాడని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటూ మండిపడ్డారు .