నటుడు సుమన్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – సీనియర్ నటుడు సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సంధ్య థియేటర్ కేసుకు సంబంధించి బన్నీని అరెస్ట్ చేయడం అక్రమమని, అప్రజాస్వామికమని అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సినిమా రిలీజ్ అయితే థియేటర్ వాళ్లు హీరో, హీరోయిన్లను పిలవడం కామన్ అంటూ పేర్కొన్నారు. ఫ్యాన్స్ రద్దీ లేకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టాకీస్ ఓనర్స్ పై ఉంటుందన్నారు.
తమ లాంటి నటులు అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిదన్నారు సుమన్.
ఇదిలా ఉండగా పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలో రేవతి చని పోయింది. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఘటనకు బాధ్యత వహించాలని కోరుతూ నటుడు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యజమాని పై కేసు నమోదు చేశారు. ఊహించని రీతిలో నటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియాలో చికిత్స చేపట్టారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అక్కడి నుంచి చెంచల్ గూడకు తరలించారు.
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఒకరోజు జైలులో ఉంచారు. ఖైదీ నెంబర్ ను కేటాయించారు.