రేవ్ పార్టీలో హేమ..ఆషి రాయ్
ముదురుతున్న విచారణ
బెంగళూరు – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ. ఇందులో పలువురు ప్రముఖులు , రాజకీయ , సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో 100 మందికి పైగా పట్టుబడ్డారు. వీరిలో సినీ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారంటూ బాంబు పేల్చారు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్.
అయితే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి హేమ తాను లేనంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేసింది. తాము అమాయకులమని పోలీసులు కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ హేమ, ఆషి రాయ్ ఆరోపించారు.
వీరి కామెంట్స్ పై సీరియస్ అయ్యారు సీపీ దయానంద్. ఆధారాలతో సహా ఆయన ఎవరెవరు పాల్గొనదనే విషయంపై వివరాలు స్వయంగా ఆయనే వెల్లడించారు మీడియా సమావేశంలో. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలి నట్లయింది.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు 103 మందిలో 86 మంది ఎండీఎంఏ , కొకైన్ వంటి పదార్ధాలు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పరీక్షలు చేపడతామని ప్రకటించారు.