రేవ్ పార్టీతో సంబంధం లేదు
ప్రముఖ టాలీవుడ్ నటి హేమ
హైదరాబాద్ – బెంగళూరు లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ అంశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో తాను ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది నటి హేమ పై. దీనిపై సోమవారం ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తాను రేవ్ పార్టీలో లేనని , హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
తనకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదన్నారు. అనవసరంగా తనను ఈ ఉచ్చు లోకి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హేమ. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది.
జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు.