ENTERTAINMENT

డ్ర‌గ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్

Share it with your family & friends

తేల్చి చెప్పిన బెంగ‌ళూరు పోలీసులు

బెంగ‌ళూరు – దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది న‌గ‌రంలోని ఎల‌క్ట్రానిక్స్ స‌మీపంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీ. ఇందులో రాజ‌కీయ ,సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బెంగ‌ళూరు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ద‌యానంద్ ప్ర‌క‌టించారు. మొత్తం రేవ్ పార్టీలో 103 మంది పాల్గొన్న‌ట్లు వెల్ల‌డించారు.

అయితే టాలీవుడ్ కు చెందిన న‌టి హేమ‌, ఆషి రాయ్ కూడా ఉన్న‌ట్లు తేలింది. కాగా తాను పాల్గొన‌లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేసింది హేమ‌. చివ‌ర‌కు ఆమె కూడా రేవ్ పార్టీలో ఉంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు సీపీ. దీంతో మ‌రో వీడియో సందేశం ఇచ్చారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బెంగ‌ళూరు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా డ్ర‌గ్స్ కూడా తీసుకున్న‌ట్లు తెలిపారు సీపీ. ఈ మేర‌కు వారు తీసుకున్నారా లేదా అన్న విష‌యంపై టెస్టులు నిర్వ‌హించామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో వైపు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌టి హేమతో పాటు 86 మందికి డ్ర‌గ్ టెస్టులు నిర్వ‌హించామ‌ని , ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింద‌న్నారు సీపీ ద‌యానంద్. పాజిటివ్ గా తేలిన వ్య‌క్తుల‌కు సీసీబీ నోటీసులు ఇస్తామ‌న్నారు.