హిందువులపై దాడులు దారుణం
ప్రముఖ నటి హీనా ఖాన్ కామెంట్
ముంబై – ప్రముఖ నటి హీనా ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ దేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించారు. సోమవారం ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ప్రీతి జింటా హిందువులకు మద్దతుగా తన గొంతు వినిపించారు. తాజాగా ఆమెతో పాటు హీనా ఖాన్ కూడా చేరారు. హిందువులు కూడా మనుషులేనని, ఒకరిపై మరొకరు దాడి చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు హీనా ఖాన్ (అక్షర). ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్న వారిని నియంత్రించక పోతే అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
“ఏ సమాజమూ ఇలాంటి భయంకరమైన చర్యలకు పాల్పడకూడదు. తప్పు తప్పు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలు తమ దేశంలో సురక్షితంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని తెలిపారు హీనా ఖాన్.
ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. దానిని అధిగమించేందుకు నానా తంటాలు పడుతోంది.