నటి నయనతార సెన్సేషన్
అత్యంత జనాదరణ పొందిన నటి
హైదరాబాద్ – విలక్షణ నటిగా గుర్తింపు పొందిన తమిళ సినీరంగానికి చెందిన నయనతార ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తను తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. అభిమానులను మెప్పించింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా అభివర్ణిస్తారు.
ఇదే సమయంలో తమిళ సినీ పరిశ్రమలో సైతం నయనతారను సైతం లేడీ డాన్ గా పేర్కొంటారు. అక్కడ నటి ఖుష్బూకు ఆలయం కట్టించారు అక్కడి ఫ్యాన్స్. ఖుష్బూ తర్వాత అత్యంత జనాదరణ పొందిన నటిగా పేరు పొందారు నయనతార.
ఆమె గతంలో శింబూ , ప్రభుదేవాతో ప్రేమాయణం నడిచిందన్న ప్రచారం జరిగింది. కానీ ఊహించని రీతిలో తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ కవల పిల్లలు పుట్టారు.
ఇక టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ చిత్రంలో నటించింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సంచలనం కలిగించింది. అయితే తన పేరుతో నటుడు ధనుష్ డాక్యుమెంటరీ తీశాడు. దీనికి సంబంధించి రచ్చ మొదలైంది. ఇందులో 3 నిమిషాల పాటను వాడుకునేందుకు గాను రూ. 10 కోట్లు డిమాండ్ చేయడం విస్తు పోయేలా చేసింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం మోస్ట్ పాపులర్ నటీమణిగా నయనతార నిలవడం విశేషం.