బీజేపీలో చేరిన నటి రూపా గంగూలీ
మోదీ నాయకత్వం చూసి చేరా
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు ఎక్కువయ్యారు. ప్రధానంగా బీజేపీలోకి ఎక్కువగా వలసలు పెరిగాయి. ఈసారి కూడా కొన్ని సీట్లు తగ్గినా మోదీ వేవ్ లో బీజేపీ పవర్ లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖలంతా క్యూ కడుతున్నారు.
తాజాగా బుధవారం పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటి, అనుపమ ఫేమ్ రూపాలీ గంగూలీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూపా గంగూలీ బీజేపీ జెండా కప్పుకున్నారు.
బుల్లి తెరపై ఆమె అద్భుతమైన నటిగా గుర్తింపు పొందారు. అనుపమ, సారా భాయ్ వర్సెస్ సారా భాయ్ షోలలో పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. బీజేపీ సీనియర్ నాయకులు వినోద్ తావ్డే , అనిల్ బలూనీ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని భావించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రూపాలీ గంగూలీ తెలిపారు. నాకు మీ అందరి ఆదరాభిమానాలతో పాటు దీవెనలు ఉండాలని కోరారు నటి.