ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్
హైదరాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం కేసీఆరేనంటూ ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చారని, దానిని గాలికి వదిలి వేశారని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకు రావాలన్న ఆలోచన చేయక పోవడం దారుణమన్నారు. ప్రతిపక్షమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ పేర్కొన్నారు అద్దంకి దయాకర్. కేసీఆర్ ను ప్రజలు పట్టించు కోవడం మానేశారని అన్నారు.
తను పాలించిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అంతే కాకుండా అన్ని వర్గాలను మోసం చేశారని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ పేరుతోనే పుణ్య కాలం గడిపారని, రాష్ట్రంలో ఉన్న వనరులను అన్నింటిని దోపిడీకి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్రమైన అన్యాయం చేశారని వాపోయారు అద్దంకి దయాకర్. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని సంచలన కామెంట్స్ చేశారు.