విజయ సాయి ఓ అజ్ఞాని
అద్దంకి దయాకర్ ఫైర్
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలోనే కూలి పోతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు రాజ్య సభ సాక్షిగా వైఎస్సార్ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విజయ సాయి రెడ్డిపై కేసు నమోదు చేశారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. విజయ సాయి రెడ్డి ఓ పెద్ద అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ పై తాము కూడా కామెంట్స్ చేయగలమని, కానీ సభ్యత అడ్డు వచ్చి ఊరుకుంటున్నామని అన్నారు.
విజయ సాయి రెడ్డి ఎందుకు తెలంగాణ సర్కార్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాడో తమకు అర్థం కావడం లేదన్నారు. కేంద్రంలో మోదీ పంచన చేరిన మీకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు అద్దంకి దయాకర్.
ఇంకోసారి గనుక నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అద్దంకి దయాకర్.