పర్యవేక్షణ బాధ్యత అదనపు కలెక్టర్లకు
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలోని అన్ని హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు రాత్రి పూట నిద్ర చేయాలని, వసతుల కల్పనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రంలోని సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. గత కొన్నేళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నామని అయినా ప్రభుత్వం పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు సమ్మె చేపట్టి 20 రోజులకు పైగా అవుతోంది. కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆందోళన విరమించడం లేదు.
దీంతో ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడిచే కస్తూర్బా బాలికల వసతి గృహాలలో ఇబ్బందులు పడుతున్నారు బాలికల విద్యార్థినులు. తాత్కాలికంగా ప్రభుత్వ టీచర్లను ఏర్పాటు చేసినా పూర్తికాలపు పనులు చేయలేక లబోదిబోమంటున్నారు.