DEVOTIONAL

పనుల పురోగతిపై అడిషనల్ ఈవో సమీక్ష

Share it with your family & friends

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం

తిరుమల – తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న నూతన యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5) భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవోకు ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనుల స్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా 16 హాళ్లలో 8 హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తైందని, మిగిలిన పని చేయాల్సి ఉందని చెప్పారు.

అనంతరం అడిషనల్ ఈవో మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని పనుల వేగవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదన్నారు.

అదేవిధంగా పీఏసీ-5లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పన్సరీ సదుపాయాలపై కూడా అధ్యయనం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వెంకటయ్య, ఆశాజ్యోతి, ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, ఈఈలు వేణు గోపాల్, సుధాకర్, ఎలక్ట్రికల్ డిఈ చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.