DEVOTIONAL

తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు

Share it with your family & friends

వ‌స‌తి స‌ముదాయ భ‌వ‌నం ప‌రిశీల‌న

తిరుమల – తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

భవనంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ కట్ట, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యుత్ వైరింగ్, హాళ్లను పరిశీలించారు.

ఈ ఏడాది చివరిలోపు పనులను పూర్తి చేసి జనవరి నెలలోపు భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కాకూడదని చెప్పారు.

యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టాల‌ని దీని వ‌ల్ల ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌య్యే ఛాన్స్ ఉంద‌న్నారు. రోజు రోజుకు తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య పెరుగుతోంద‌ని తెలిపారు. దీంతో రాను రాను గ‌దులు దొరికే ఛాన్స్ లేకుండా పోతోంద‌ని, దీంతో భ‌క్తుల ర‌ద్దీకి త‌గిన‌ట్టు భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంద‌న్నారు ఈ సంద‌ర్బంగా అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.