DEVOTIONAL

శ్రీ‌వారి బ‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై స‌మీక్ష

Share it with your family & friends

అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి రివ్యూ

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబరు 8న జరిగే గరుడ సేవకు లక్షలాదిగా విచ్చేసే భక్తులపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని, ఘ‌నంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో గరుడ సేవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

అందులో భాగంగా వాహనముల ముందు ప్రదర్శించే వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను అదనపు ఈఓ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

తర్వాత ఆయన అన్నప్రసాదం విభాగం రూపొందించిన నాలుగు మాడ వీధులలో అన్న ప్రసాద వితరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా అధ్యయనం చేశారు.

ఇందులో అన్నప్రసాదాల తయారీ, పంపిణీ మార్గాలు , గ్యాలరీలలో ఉన్న భక్తులకు సజావుగా అన్న ప్రసాదాలు పంపిణీ అయ్యేలా ఇతర విభాగాలతో సమన్వయం చేయడం వంటివి ఉన్నాయి.

ఈ సమావేశంలో రవాణా శాఖ జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, హెచ్‌డీపీపీ , విజిలెన్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.