అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
లడ్డూ కౌంటర్ లో టీటీడీ
తిరుమల – తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.