Monday, April 21, 2025
HomeDEVOTIONALతిరుమల లో అధ్యయనోత్సవాలు

తిరుమల లో అధ్యయనోత్సవాలు

డిసెంబర్ 30 నుండి జ‌న‌వ‌రి 23 వ‌ర‌కు

తిరుమ‌ల – తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగ‌నున్నాయని వెల్ల‌డించింది టీటీడీ.

సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఈ సందర్భంగా స్వామి వారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహ స్వామి వారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments