Saturday, April 19, 2025
HomeDEVOTIONALఘ‌నంగా అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

ఘ‌నంగా అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుప‌తి – తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ అధ్య‌య‌నోత్స‌వాలు కొన‌సాగనున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భారీ ఏర్పాట్లు చేసింది. ఉత్స‌వాల‌లో భాగంగా మాఘ మాసంలో ఆలయంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ప్రతి రోజూ రాత్రి 7.15 గంటలకు ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారిని, సేనాధిపతి వారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 7న చిన్న శాత్తుమొర, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ ధనంజయ, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments