SPORTS

ఆడుదాం ఆంధ్రా సూపర్ సక్సెస్

Share it with your family & friends

25.40 లక్షల మంది క్రీడాకారులు

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆడుదాం ఆంధ్రా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసామ‌న్నారు ఈ సంద‌ర్బంగా మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. ఎంపికైన 14 మంది క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఆడుదాం ఆంధ్రాతో 37 కోట్ల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేశామ‌న్నారు. విజేతలకు 12.21 కోట్ల విలువైన బహుమతులు అందజేసిన‌ట్లు చెప్పారు. ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరమ‌న్నారు.

గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించ గలిగితే, సాన పట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ వంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించేలా చేసిన ఈ కార్య‌క్ర‌మం అద్భుత‌మ‌న్నారు మంత్రి. మొత్తంగా ఆడుదాం ఆంధ్ర‌లో 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయ‌న్నారు.

1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు ఆర్కే రోజా, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలోలో పాల్గొన్న‌ట్లు తెలిపారు.