టి20లో అత్యధిక వికెట్లు
హైదరాబాద్ – ఆఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ టి20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పటి దాకా రికార్డ్ నమోదు చేసిన విండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో రికార్డ్ ను బ్రేక్ చేశాడు. రషీద్ ఖాన్ 633 వికెట్లు తీశాడు.
గ్కెర్‌బెర్హాలో పార్ల్ రాయల్స్‌తో జరిగిన MI కేప్ టౌన్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. మొత్తం 461 మ్యాచ్ లు ఆడాడు. 18.07 సగటు కలిగి ఉన్నాడు. తన కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడం.
అంతే కాదు నాలుగు సార్లు 5 వికెట్లు తీశాడు. ఇది కూడా ఓ రికార్డే. మరో వైపు విండీస్ బౌలర్ బ్రావో టి20 కెరీర్ లో విండీస్ తో పాటు ఇతర ఫ్రాంచైజీలతో కలిపి 631 వికెట్లు తీశాడు. తన సగటు 24.40 గా ఉంది. మూడుసార్లు 5 వికెట్లు తీశాడు. 23 రన్స్ కు 5 వికెట్లు కూల్చాడు.
ఇక టీ20 ఫార్మాట్ లో రషీద్ ఖాన్ , బ్రావో తర్వాతి స్థానాలలో విండీస్ సూపర్ ఆల్ రౌండర్ సరన్ 574 వికెట్లు, సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ తాహిర్ 531, బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ 492 వికెట్లు తీశాడు. తను 6 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇది వరల్డ్ రికార్డ్ గా నమోదైంది. దీనిని ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు.