ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ – ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. తాము దావోస్ పర్యటనలో లక్షా 79 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వాణిజ్యం, వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా విధానాల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా చేశామన్నారు.
పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నామని, మూసీ ప్రక్షాళన, నిరుద్యోగులకు నైపుణ్యం పెంపునకు సహకరిస్తామని సింగపూర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇద్దరు మంత్రులను కలిశామని వెల్లడించారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించడం జరిగిందని చెప్పారు.
ప్రతిపక్షాలు తమపై చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. తాము అబద్దాలు చెప్పమని, ఏది జరిగితే అదే చెబుతామన్నారు. ఆరు హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. ఐటీ పరంగా ఇండియాలో టాప్ లో కొనసాగుతున్నామని అన్నారు. వేలాది మందికి ఉపాధి దక్కుతోందన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాభివృద్దిలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు శ్రీధర్ బాబు.