NEWSANDHRA PRADESH

అగ్రి గోల్డ్ కేసులో జోగి రాజీవ్ అరెస్ట్

Share it with your family & friends

మాజీ మంత్రి జోగి ర‌మేష్ త‌న‌యుడు

అమ‌రావ‌తి – రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన అగ్రి గోల్డ్ కేసు రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా ఏపీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కు బిగ్ షాక్ ఇచ్చింది టీడీపీ కూట‌మి స‌ర్కార్. అగ్రి గోల్డ్ భూమి కొనుగోలు కేసుకు సంబంధించి జోగి ర‌మేష్ త‌న‌యుడు జోగి ర‌మేష్ ను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి మ‌రికొంత మంది నిందితులు ఉన్నార‌ని, వారిని కూడా త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా అగ్రి గోల్డ్ కేసులో 9 మంది నిందితులు ఉన్న‌ట్లు తేల్చారు. వీరిలో మాజీ మంత్రి త‌న‌యుడు జోగి రాజీవ్ తో పాటు జోగి ర‌మేష్ సోద‌రుడు వెంక‌టేశ్వ‌ర్ రావు, అడుసుమిల్లి మోహ‌న రంగ దాసు, వెంక‌ట సీతామ‌హా ల‌క్ష్మి ఉన్నారని పేర్కొన్నారు.

వీరితో పాటు మాజీ మంత్రికి స‌హ‌క‌రించిన వారిలో స‌ర్వేయ‌ర్ దేదీప్య‌, మండ‌ల స‌ర్వేయ‌ర్ ర‌మేష్‌, డిప్యూటీ త‌హ‌శిల్దార్ విజ‌య్ కుమార్, విజ‌య‌వాడ రూర‌ల్ ఎమ్మార్వో జాహ్న‌వి, విజ‌యవాడ రిజిస్ట్రార్ నాగేశ్వ‌ర్ రావులను నిందితులని పోలీసులు వెల్ల‌డించారు.