కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
ప్రకటించిన ఏఐసీసీ కార్యదర్శి కేసీ
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే ఆయా పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. అన్ని పార్టీలకంటే ముందస్తుగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ హై కమాండ్ తొలి విడతలో ఏకంగా 195 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 34 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఏఐసీసీ హైకమాండ్ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు.
అస్సాం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ తో పాటు డామన్ డ,య్యూ నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 43 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో 10 మంది భ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా 33 మంది అభ్యర్థులు మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.
ఇక వయసు పరంగా చూస్తే 25 మంది అభ్యర్థులు 50 ఏళ్ల లోపు ఉన్నారని, 8 మంది అభ్యర్థులు 51 నుంచి 60 ఏళ్ల మధ్యలో , 10 మంది అభ్యర్థులు 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు లోపు కలిగిన వారు ఉన్నారని చెప్పారు.