33 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 33 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీకి షాక్ ఇచ్చింది అధిష్టానం. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇప్పటికే అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న బహుజనులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు రేవంత్ రెడ్డి ఆచరణకు పొంతన లేకుండా పోయిందని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా నాలుగు లోక్ సభ స్థానాలకు సంబంధించి ఇద్దరు రెడ్లకు ఛాన్స్ ఇచ్చింది. నల్లగొండ నుంచి మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి తనయుడు కందూర్ రఘువీర్ రెడ్డిని ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ , మహబూబాబ్ నుంచి బలరాం నాయక్ ను ఎంపిక చేసింది.