నలుగురికి ఛాన్స్ ఇచ్చిన ఏఐసీసీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. రాజ్యసభకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా కసరత్తు చేసింది. ప్రస్తుతానికి నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది.
ఈ మేరకు ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి అరుదైన అవకాశం ఇచ్చింది. ఆమె తన భర్తను కోల్పోయినా చివరి దాకా పని చేస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ , బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్ , హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ , మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే లను ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ప్రధానంగా రాజ్యసభ రేసులో భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ , మాజీ ఎంపీ , తాజాగా జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన, హెచ్ సీ ఏ మాజీ చైర్మన్ మహమ్మద్ అజహరుద్దీన్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు టాక్.