Monday, April 7, 2025
HomeNEWSతెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్

ప్ర‌క‌టించిన ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్‌ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ‌తో పాటు హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జుల‌ను నియ‌మించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ ఛార్జ్ గా ప‌ని చేసిన దీపా దాస్ మున్షీ ప‌నితీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . పార్టీ ప‌రంగా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేయ‌డంలో విఫ‌ల‌మైనట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. కేబినెట్ లో ఇద్ద‌రు కీల‌క శాఖ‌లు చేప‌ట్టిన మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

దీనిపై అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. ఈ మేర‌కు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని హుటా హుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. దీంతో సీఎంను మారుస్తార‌న్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే క్ర‌మంలో రాహుల్ గాంధీ ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌క పోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments