NEWSANDHRA PRADESH

ష‌ర్మిల కొడుకు పెళ్లికి ప్ర‌ముఖులు

Share it with your family & friends

అంగ‌రంగ వైభ‌వంగా వివాహం

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కొడుకు పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖులు , వివిధ రాజ‌కీయ‌, సినీ, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన వారు హాజ‌ర‌య్యారు. విచిత్రం ఏమిటంటే త‌న స్వంత సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రు కాక పోవ‌డం విశేషం.

తాజాగా నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన వారిలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రె్డి, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ , ఏపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ , మాజీ పీసీసీ చీఫ్ లు నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డి, శైల‌జా నాథ్, గిడుగు రుద్ర‌రాజు , డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణా రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా త‌న త‌న‌యుడి పెళ్లికి హాజ‌రైన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.